IND vs ENG 1st Test: Virat Kohli-led India will be hoping for a change in fortune in the upcoming series, having suffered a 1-4 defeat in England in 2018.
#INDvsENG1stTest
#IndiavsEnglandTestHistory
#INDVSENG1stTestMatch1932
#RohitSharma
#ViratKohli
#Englandrecordsintests
#IPL2021
#Testseries
2011లో 0-4తో క్లీన్ స్వీప్.. 2014లో 1-3, 2018లో 1-4.. సంత్సరాలు మారుతున్న ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు ప్రదర్శన మాత్రం మారడంలేదు. పటిష్ట ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై రెండు సార్లు ఓడించి చరిత్ర సృష్టించినా.. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం మాత్రం కలగానే మిగిలిపోతోంది. మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కోహ్లీసేన సిద్దమైంది. బుధవారం నుంచి ప్రారంభమమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించాలని కోహ్లీసేన భావిస్తుండగా.. భారత్‌లో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.పేపర్‌పై ఇరు జట్లు బలంగానే ఉన్నప్పటికీ గత రికార్డులు కోహ్లీసేనను కలవరపెడుతున్నాయి.